కృష్ణాజిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కృష్ణ ఆధ్వర్యంలో మచిలీపట్నం కలెక్టరేట్ కార్యాలయం ఎదుట బుధవారం థాలీ బచావో కార్యక్రమం నిర్వహించారు. పెడన నియోజకవర్గ కాంగ్రెస్ శొంఠి నాగరాజు నాయకత్వంలో ధర్నా చౌక్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి నినాదాలు చేస్తూ కాళీ ప్లేట్లు మోగించారు. నాగరాజు మాట్లాడుతూ, ప్రభుత్వం ఏర్పడి 100 రోజులైనా ప్రజలకిచ్చిన సూపర్ సిక్స్ హామీని నెరవేర్చడం లేదన్నారు