జిల్లాలోని వినియోగదారులకు ఉచిత ఇసుకను అందించేందుకు టెండర్ ప్రక్రియ ద్వారా ఏజెన్సీని గుర్తించి ఖరారు చేయాలని, అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. సోమవారం మచిలీపట్నంలో జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రీచ్ లలో ఇసుక తవ్వి వాహనముల ద్వారా సమీపంలోని స్టాక్ పాయింట్లకు తరలింపు తదితర ఏర్పాట్లు చేయాలన్నారు.