మోపిదేవి జడ్పీ పాఠశాల క్రీడా మైదానంలో సర్వ శిక్ష అభియాన్ నిధులు రూ. 3. 95 లక్షలతో బాలుర కోసం రెండు మరుగుదొడ్లు నిర్మించారు. కానీ ఇంతవరకు ఉపయోగించకుండా వదిలేశారని స్థానికులు గురువారం తెలిపారు. భవనం చుట్టూ పిచ్చి చెట్లు ఏపుగా పెరిగి అడవిని తలపిస్తోందని, ఎవరూ పట్టించుకోకపోవడంతో భవనం పాడవుతోందని, తక్షణమే దానిని అందుబాటులోకి తీసుకొచ్చి ప్రభుత్వ లక్ష్యానికి సార్ధకత చేకూర్చాలని ప్రజలు కోరుతున్నారు.