బాణ సంచల దుకాణాలు ఏర్పాటు చేసేందుకు లైసెన్స్ కలిగిన వ్యాపారుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర శుక్రవారo తెలిపారు. ఈనెల 29వ తేదీ నుండి 31వ తేదీ వరకు దీపావళి పండుగ సందర్భంగా లేబర్ కాలరీలో స్టేడియం కొరకు కేటాయించిన స్థలము నందు మరియు మాకినేని బసవ పున్నయ్య మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియం, స్టాల్స్ ఏర్పాటు చేసుకొనుటకు విక్రయదారులు దరఖాస్తు చేసుకోగలరని తెలిపారు.