రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె పండుగ కార్యక్రమం సోమవారం కంకిపాడులో అట్టహాసంగా ప్రారంభమైంది. ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి పల్లె పండుగ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, శాసనసభ్యులు బోడె ప్రసాద్, వెనిగండ్ల రాము, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీలు పాల్గొన్నారు