ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కూటమి ప్రభుత్వం, హిందూ సమాజం పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన పేర్ని నాని దిష్టి బొమ్మని గురువారం కంకిపాడు సెంటర్లో దగ్ధం చేశారు. ఈ సందర్భంగా కూటమి నాయకులు మాట్లాడుతూ మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే దిష్టి బొమ్మ స్థానంలో నిన్ను తగలెట్టే రోజులు వస్తాయని, జాగ్రత్తగా ఉండమని తెలుగుదేశం, జనసేన నాయకులు, కార్యకర్తలు హెచ్చరించారు.