గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వ విశేష కృషి చేస్తుందని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు. ఆదివారం బంటుమిల్లి మండలం కొర్నిపాడు, అర్థమూరు గ్రామాల్లో సిసి రహదారుల నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి, జనసేన నాయకులు పాల్గొన్నారు.