వైసిపి నేతలకు ప్రజలే బుద్ధి చెప్పారని ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు పేర్కొన్నారు. గురువారం మచిలీపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వైసిపి నాయకులు కొడాలి నాని, పేర్ని నానిలు పిచ్చిగా గత ప్రభుత్వంలో మాట్లాడడం కారణంగానే ప్రజలు ఇళ్ళకు సాగనంపారని తెలిపారు. చంద్రబాబును విమర్శించే అర్హత ఎవరికీ లేదని, గత వైసిపి ప్రభుత్వం పాలనలో, అవినీతి అక్రమాలే జరిగాయని విమర్శించారు.