బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని మచిలీపట్నం మహిళా పోలీస్ స్టేషన్ ఎస్ఐలు జి. రమేష్ బాబు, మస్తాన్ ఖాన్ పేర్కొన్నారు. గురువారం స్థానిక రుస్తుంబాద ఉన్నత పాఠశాలలో విద్యార్థినీ, విద్యార్థులకు అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్బంగా ఎస్ఐలు బాలలపై లైంగిక నేరాలు, బాల్యవివాహాలు, కొత్తగా జరుగుతున్న నేరాల తీరు, పలు అంశాలపై అవగాహన కల్పించారు.