భారతదేశం గర్వించదగ్గ మహోన్నత వ్యక్తి రతన్ టాటా అని ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు గురువారం మచిలీపట్నంలో ఒక ప్రకటన విడుదల చేశారు. జాతీయ, అంతర్జాతీయ వాణిజ్య యవనికపై తనదైన ముద్ర వేసిన పారిశ్రామిక వేత్త, చైర్మన్ ఎమెరిటస్ ఆఫ్ టాటా సన్స్ రతన్ నావల్ టాటా అన్నారు. నష్టాల్లో ఉన్న కంపెనీలను జాగ్వార్, లాండ్‌రోవర్‌లను కొని లాభాల బాటలోకి నడిపించారన్నారు. ఆయన మృతి బాధాకరమన్నారు.