గుడివాడ నియోజకవర్గంలోని రామచంద్రాపురం పెద్ద కాలువకి గండి పడింది. దీంతో కాలవ కింద వందల ఎకరాల పంట పొలాలు నీట మునిగాయి. ఎన్నో నెలలుగా బలహీనంగా ఉన్నా పెద్ద కాలవ గట్టును పూడ్చమంటే డబ్బులు లేవని అధికారులు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని రైతులు ఆరోపిస్తున్నారు.