గన్నవరం నియోజకవర్గంలోని పలు సమస్యలను బుధవారం గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావ్ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి లోకేష్ దృష్టికి తీసుకువెళ్లారు. మంత్రి నారా లోకేశ్ తో గన్నవరం నియోజకవర్గం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మర్యాద పూర్వకంగా కలిసి పలు విషయాలపై చర్చించారు. ఈ సందర్భంగా మల్లవల్లి పారిశ్రామికవాడ అభివృద్ధి, ప్రభుత్వ పథకాల అమలు తీరు, భవిష్యత్తులో చేపట్టే కార్యక్రమాలపై వివరించారు.