చల్లపల్లిలోని విజయ అకాడమీలో అవనిగడ్డ నియోజకవర్గంలోని లంక, ద్వీప గ్రామాల వరద బాధితులను ఆదుకోవడం కోసం విజయ హైస్కూల్ విద్యార్థులు విరాళాలు సమీకరించారు. శనివారం రూ. ఐదు లక్షలు విరాళాన్ని ప్రిన్సిపాల్ నాగళ్ల భీమారావు చేతుల మీదుగా ఎమ్మెల్యే బుద్ధ ప్రసాదుకు అందచేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చిట్టి చేతుల గట్టి సహాయం స్ఫూర్తిదాయకమన్నారు. విద్యార్థులలో మానవత్వం చిన్న వయసులోనే కలిగించిందన్నారు.