డిగ్రీలోనే సాంకేతిక మరియు భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు అభివృద్ధి చేస్తే సాఫ్ట్వేర్ ఉద్యోగం సాధ్యమని ఏఎంఎస్ సాఫ్ట్వేర్ సీఈవో టి. జీవన్ వర్మ అన్నారు. మామిడికుదురు దీప్తి డిగ్రీ కళాశాలలో సోమవారం జరిగిన సదస్సులో ఆయన మాట్లాడుతూ, సాఫ్ట్వేర్ డెవలపర్లకు కోడింగ్, ఎన్క్రిప్షన్, డీబగ్గింగ్ వంటి సాంకేతిక నైపుణ్యాలు, కమ్యూనికేషన్, సమస్య పరిష్కార నైపుణ్యాలు అవసరమని వివరించారు.