ఈ నెల 26వ తేదీన రాజమండ్రి నగరంలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలియజేశారు. సోమవారం రాజమండ్రిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం యువతకు ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఈ క్రమంలో వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు వెల్లడించారు. కాగా ఉద్యోగమేళాను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.