పిఠాపురం మండలంలోని మల్లాం గ్రామంకి చెందిన కుంపట్ల మునిరత్నం తన బంధువులే తన భూమిని కబ్జా చేశారని డిప్యూటీ సీఎం కార్యాలయాన్ని ఆశ్రయించింది. జనసేన నాయకులు ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించి సంబంధిత అధికారులతో మాట్లాడి విషయం తెలుసుకొని ఆమెకు న్యాయం చేయాలని పవన్ కళ్యాణ్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. తన సమస్య పరిష్కారమైందని వృద్ధురాలు గురువారం పవన్ చిత్రపటానికి పాలాభిషేం చేశారు.