రైల్వే ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు "స్నేహ హస్తం" అవుట్ రీచ్ క్యాంప్ నిర్వహిస్తోంది. శుక్రవారం సామర్లకోట కమ్యూనిటీ హాల్లో జరిగిన క్యాంప్‌లో సీనియర్ పర్సనల్ ఆఫీసర్ ఆనంద్ కట్టా ఆధ్వర్యంలో నిర్వహించారు. 150 కంటే ఎక్కువ ఫిర్యాదులు నమోదు కాగా, హెచ్ఆర్ఎంఎస్, ఎన్‌పిఎస్, యుఎంఐడి పై 120 ఫిర్యాదులను అక్కడికక్కడే పరిష్కరించారు. రైల్వే ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యలపై ఈ శిబిరం దృష్టి పెట్టింది.