నిడదవోలు మండలం పందలపర్రు ఇసుక స్టాక్ పాయింట్ వద్ద ఇసుక దందా జరుగుతుందంటూ ఆదివారం లారీ యజమానులు ఆందోళన నిర్వహించారు. బిల్లులు లేకుండా ఓ వ్యక్తి అక్రమంగా ఇసుక తరలిస్తున్నాడని, అధికారులు సైతం అతనికి కొమ్ముకాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం ఉదయం రెండు లారీలను బిల్లు లేకుండా తరలించగా, లారీ యజమానిని అడ్డుకోవడంతో అతను హడావిడిగా బిల్లులు రాయించుకున్నారని తెలిపారు.