డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట మండల పరిషత్ కార్యాలయంలో ఈ నెల 7న సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి జిల్లా కలక్టర్ మహేష్ కుమార్ హాజరు కానున్నారు. మండల స్థాయి ప్రజా ఫిర్యాదులను, వినతులను స్వీకరించనున్నారు. అర్జీదారులు ఈ విషయాన్ని గమనించి తమ ఫిర్యాదులను డివిజన్ స్థాయి అధికారులు దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని అధికారులు కోరారు.