గ్రామీణ ప్రాంతాలలో స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఎంటర్ ప్రేన్యూర్షిప్ కార్యక్రమాలను ప్రోత్సహించడం ద్వారా పేదరిక సమస్య పరిష్కారమవుతుందని డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా డిఆర్డిఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ వి. శివ శంకర ప్రసాద్ అన్నారు. కొత్తపేట మండలం మహిళా సమాఖ్య ఆఫీస్ నందు గురువారం గ్రామీణ జీవనోపాధి మిషన్ ఎస్. వి. ఈ. పి ద్వారా జరుగుతున్న సిఆర్పి శిక్షణా కార్యక్రమానికి ఆయన విచ్చేశారు.