రైల్వే కోడూరు మండలం కే. బుడుగుంట పల్లి వికాస్ నగర్ కి చెందిన ముని లక్ష్మి (35) పెంపుడు కుక్క కాటు వేయడంతో రేబిస్ వ్యాధి సోకడంతో గురువారం చికిత్స పొందుతూ మరణించారు. మృతురాలు ముని లక్ష్మికి ఇద్దరు కుమారులు ఉన్నారు. పెంపుడు కుక్కలు, వీధి కుక్కలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డాక్టర్లు సూచించారు.