రైల్వే కోడూరు మండలం రెవెన్యూ అధికారిగా మహబూబ్ చాంద్ సోమవారం రెవెన్యూ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. రాజంపేటలో తహసీల్దారు గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆమె బదిలీపై రైల్వే కోడూరు రెవెన్యూ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను సాధ్యమైనంత వరకు త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు.