పంటకు అందించే రసాయనిక ఎరువు స్థానంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతి ద్వారా తయారు చేసే ఘన జీవామృతం వినియోగించాలని మైదుకూరు మండలం వనిపెంట కేవీకే సీనియర్ శాస్త్రవేత్త ఎం. బాలకృష్ణ అన్నారు. శుక్రవారం మండలంలోని ఆదిరెడ్డిపల్లెలో ఘన జీవామృతం తయారీ, వినియోగించడంతో కలిగే లాభాలను వివరించారు. ఘన జీవామృతాన్ని పొడిగా చేసి వేప లేక కానుగ చెక్కతో కలిపి పంటకు వేయడంతో మొక్కకు కావాల్సిన పోషకాలు అందుతాయని వివరించారు.