పోరుమామిళ్లలో విద్యుత్ వినియోగదారులు ఆదివారం విద్యుత్ కార్యాలయం వద్ద బిల్లులు చెల్లించవచ్చని డీఈఈ రవి చంద్రశేఖర్, ఏఈ వెంకట మహేశ్ తెలిపారు. విద్యుత్ చెల్లింపులలో ఎటువంటి అసౌకర్యాలు ఉండవని, యధాస్థితిగా ఆదివారం కూడా బిల్లు చెల్లించేందుకు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని వినియోగదారులకు కోరారు.