బద్వేల్ పట్టణంలో అక్రమంగా నిర్మించిన కట్టడాలను గురువారం మున్సిపల్ సిబ్బంది తొలగించారు. ప్రభుత్వ స్థలాలలో అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టడం సరైన పద్ధతి కాదని తెలిపారు. అక్రమ కట్టడాలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేవని స్పష్టం చేశారు. అక్రమంగా కట్టిన కట్టడాలను జేసీబీల ద్వారా కూల్చివేసినట్లు మున్సిపల్ అధికారులు చెప్పారు.