నరసరావుపేట: వసతి గృహాన్ని తనిఖీ చేసిన జిల్లా జడ్జి

70பார்த்தது
రామిరెడ్డి పేటలోని సాంఘిక సంక్షేమ కళాశాల బాలుర వసతి గృహాన్ని శనివారం జిల్లా జడ్జి సత్యశ్రీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వసతి గృహంలో పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడం చూసి వార్డెన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్టల్లో బీరు బాటిళ్లు, సిగరెట్లు, పాన్ పరాక్ ప్యాకెట్లు వంటి చెత్తాచెదారం చూసి విస్తుపోయారు. అనంతరం వార్డెన్ పై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.

தொடர்புடைய செய்தி