కారంపూడిలోని జెడ్పీహెచ్ఎస్, ప్రభుత్వ వైద్యశాలను కలెక్టర్ అరుణ్ బాబు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. బ్రహ్మనాయుడు జెడ్పీ హైస్కూల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించారు. హెచ్ఎం అనంత శివ భోజనాలపై వివరణ కోరగా పొంతన లేని సమాధానం చెప్పడంతో రికార్డులను పరిశీలించి ఆయనపై విచారణ చేయాలని ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి ని ఆదేశించారు. అనంతరం ప్రభుత్వ వైద్యశాలను పరిశీలించి వివరాలు అడిగి సంతృప్తి వ్యక్తం చేశారు.