మేడికొండూరు: మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తి పై కేసు నమోదు

73பார்த்தது
మేడికొండూరు: మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తి పై కేసు నమోదు
మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తి పై మంగళవారం మేడికొండూరు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు మండలంలోని సిరిపురానికి చెందిన సాయికుమార్ పెయింటింగ్ పనులకు వెళ్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన ఓ మహిళ ఇంట్లో ఒంటరిగా ఉండడాన్ని గమనించిన అతడు లోపలికి చొరబడి అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

தொடர்புடைய செய்தி