గుంటూరు జిల్లాలో హోంగార్డుగా పనిచేసిన గ్లోరీ ఫ్లారెన్స్ ఉద్యోగ విరమణ చేశారు. ఈ సందర్భంగా జిల్లాలోని హోంగార్డులు తమ ఒకరోజు వేతనాన్ని రూ. 2. 27 లక్షలు ఆమెకి విరాళంగా ప్రకటించారు. అందుకు సంబంధించిన చెక్కును సోమవారం పోలీస్ కార్యాలయంలో ఎస్పీ సతీశ్ కుమార్ చేతుల మీదుగా గ్లోరీ ఫ్లారెన్స్ కు అందించారు. హోంగార్డుల సేవాభావం అభినందనీయమని ఎస్పీ ప్రశంసించారు.