జిల్లాలోని హౌసింగ్ లే అవుట్లలో ఇళ్ళ నిర్మాణాలు ప్రతి వారం నిర్దేశించిన లక్ష్యాలు అధిగమించేలా అధికారులు కృషి చేయాలని కలెక్టర్ నాగలక్ష్మీ ఆదేశించారు. హౌసింగ్ అధికారులను సమన్వయం చేసుకొని ఎంపీడీవో, మున్సిపల్ కమిషనర్లు ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలని చెప్పారు. మంగళవారం హౌసింగ్ ఇళ్ళ లే అవుట్లలో ఇళ్ళ నిర్మాణం, అంగన్వాడీ కేంద్రాలలో అభివృద్ధి పనులు, ఉపాధి హామీ పథకం పనులపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.