ఏపీలోని తిరుపతిలో ఫుడ్ సెఫ్టీ అధికారులు మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల కోసం 13 జిల్లాల నుంచి అధికారులు తిరుపతికి వచ్చారు. శిల్పారామం ఎదురుగా ఉన్న పద్మావతి హోటల్‌తో పాటు పలు రెస్టారెంట్స్‌లో తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో కుళ్లిన మాంసం, బూజుపట్టిన ఆహార పదార్థాలు లభ్యమైనట్లు అధికారులు తెలిపారు. నాణ్యతా ప్రమాణాలు పాటించని హోటళ్లపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఫుడ్ సెఫ్టీ అధికారులు హెచ్చరించారు.