డిగ్రీ పూర్తయిన పట్టభద్రులు తప్పనిసరిగా మీ ఓటుని నమోదు చేసుకోవాలని తాడేపల్లిగూడెం నియోజకవర్గం టిడిపి ఇన్చార్జి వలవల బాబ్జి కోరారు. ఈ సందర్భంగా బుధవారం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పాత వారు కూడా తమ ఓటు ఉందని అనుకోకుండా తప్పనిసరిగా మీ ఓటుని మరల తిరిగి నమోదు చేసుకోవాలని సూచించడం జరిగింది. గతంలో తాడేపల్లిగూడెంలో 10, 000 ఓట్లు ఉండేవని, వాటిలో మార్పులు చేర్పులు జరుగుతాయని తెలిపారు.