ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం రుద్రంకోట గ్రామానికి చెందిన గాదె అనిల్(28) సోమవారం ద్విచక్ర వాహనంపై భద్రాచలం వెళ్తుండగా గౌరీదేవిపేట, తోటపల్లి గ్రామాల మధ్య గ్యాస్ సిలిండర్ల లారీని తప్పించబోయి వెనుక నుంచి ఢీ కొట్టాడు. ఈ ఘటనలో అనిల్ తలకు బలమైన గాయం తగలడంతో ప్రమాద స్థలంలోనే మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.