తిరుపతి వెంకటేశ్వరస్వామి లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడడం హిందువుల మనోభావాలను దెబ్బ తీసేలా చేసినందుకు నిరసనగా, పశ్చిమ గోదావరి జిల్లా పూడూరు మండలం వెడంగిలో హిందూ ధర్మ పరిరక్షణ సమితి మరియు కూటమి పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం పాదయాత్ర నిర్వహించారు. హిందూ ధర్మ పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు వినుకొండ రంగారావు మాట్లాడుతూ కల్తీ నెయ్యి వాడటం హేయమైన చర్య అని, బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.