బుధవారం ఏలూరు పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావును దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పోలీసులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని, పోలీసు వాహనాలు, సిబ్బంది కొరత సమస్య పరిష్కరించాలని కోరారు. అదేవిధంగా పెదవేగి పోలీస్ స్టేషన్ శాశ్వత భవన నిర్మాణం, సర్కిల్ కార్యాలయం ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని కోరారు.