కార్తిక మాసం సందర్భంగా పుణ్య క్షేత్రాల సందర్శనకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఏలూరు జిల్లా ఆర్టీసీ డీపీటీవో వరప్రసాద్ తెలిపారు. వచ్చే నెల 3, 10, 17, 24 తేదీల్లో అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోటకు ప్రతి ఆదివారం రాత్రి ఏలూరు, జంగారెడ్డిగూడెం, నూజివీడు డిపోల నుంచి బస్సులు బయల్దేరి సోమవారం రాత్రికి తిరిగి ఆయా డిపోలకు చేరుతాయన్నారు.