తణుకు మండలం కోనాల గ్రామంలో శనివారం 104 వాహనం ద్వారా ఫ్యామిలీ పిజిషియన్ వైద్య శిబిరం నిర్వహించారు. డాక్టర్ కిశోర్ నేతృత్వంలో గ్రామంలో ఇళ్లవద్దకే వెళ్లిన వైద్య బృందం పలువురికి మధుమేహం,రక్తపోటు పరీక్షలు నిర్వహించి మందులు అందచేశారు. ఈ కార్యక్రమంలో హెచ్ వీ దుర్గ కుమారి, డీఈఓ సాయిరాం వెంకటేశ్, ఎంఎల్ హెచ్ పీ కోటేశ్వరి, ఎంపీ హెచ్ ఏ రఘు, ఏఎన్ఎం మరియమ్మ, పైలట్ ఆనంద్, ఆశ సిబ్బంది, అంగన్వాడీలు పాల్గొన్నారు.