ప్రధానమంత్రి పిలుపుమేరకు స్వాతంత్ర దినోత్సవం నాడు ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం ఎగర వెయ్యాలని ఎమ్మెల్యే యనమల దివ్య అన్నారు. తుని పట్టణంలోని రాజా క్రీడా మైదానం నుంచి పట్టణ పురవీధుల్లో 'హర్ ఘర్ తిరంగా' విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ అందరిలోనూ దేశభక్తిని పెంపొందించేదుకే హర్ ఘర్ తిరంగా కార్యక్రమం మని ఆమె అన్నారు. రాజా అశోక్ బాబు, యనమల రాజేష్, కుసుమంచి శోభారాణి తదితరులు పాల్గొన్నారు.