మాత, శిశు మరణాల రేటును తగ్గించాలని తూ. గో జిల్లా కలెక్టర్ ప్రశాంతి అధికారులకు సూచించారు. బుధవారం రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ వద్ద ఆమె వైద్యారోగ్య, స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. హైరిస్క్ గర్భీణులను గుర్తించి వారికి కావాల్సిన వైద్య సదుపాయాలను సకాలంలో అందించాలన్నారు. ఐసీడీఎస్, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.