2029 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైయస్ షర్మిల ముఖ్యమంత్రి అవుతారని తూ. గో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు టి. కె విశ్వేశ్వర రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. శనివారం రాజమండ్రిలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తిరుమల లడ్డు వివాదం నిగ్గు తేలితే చంద్రబాబు, జగన్ మోహన్ రెడ్డిలలో ఒకరు రాజకీయ సమాధి ఖాయం అని జోష్యం చెప్పారు.