తూ. గో జిల్లాలో అపస్కృతంగా ఉన్న మున్సిపల్ సమస్యలు పరిష్కారం కోసం ఈ నెల 25న రాజమండ్రిలో జరిగే ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా జనరల్ బాడీను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు తాటిపాక మధు పిలుపునిచ్చారు. సోమవారం రాజమండ్రిలో ఆయన మాట్లాడుతూ రాజమండ్రిలో జనాభా ప్రాతిపదికన కార్మికుల సిబ్బందీ ని పెంచాలని డిమాండ్ చేసారు.