అంబేడ్కర్ ఆశయాలను కొనసాగించడానికి అందరూ కృషి చేయాలని నగర కమిషనర్ కేతన్ గార్గ్ పిలుపునిచ్చారు. అంబేడ్కర్ రాజమండ్రి విచ్చేసి 80 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నగరపాలక సంస్థ కార్యాలయంలో శనివారం ఆయన విగ్రహం వద్ద వేడుక నిర్వహించారు. అంబేడ్కర్‌కు పౌరసన్మానం జరిగిన ఈ కార్యాలయంలో తాను కమిషనర్‌గా సేవలందించడం తన అదృష్టంగా భావిస్తున్నానని కమిషనర్ తెలిపారు.