రాష్ట్ర అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు అన్నారు. డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట పట్టణం 26వ వార్డు కౌన్సిలర్ అమలదాసు సీతామహాలక్ష్మి భర్త రుద్రమూర్తి మరియు వారి అనుచరులు వైసీపీ ని వీడి గురువారం తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరందరికీ ఎమ్మెల్యే జోగేశ్వరరావు టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి సాధరంగా ఆహ్వానించారు.