రౌడీషీటర్లు తమ విధానాలను మార్చుకొని సత్ప్రవర్తనతో మెలగాలని మండపేట రూరల్ సి. ఐ దొరరాజు అన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రౌడీషీటర్లకు ఆదివారం మండపేట రూరల్ పోలీసు స్టేషన్లో కౌన్సెలింగ్ నిర్వహించారు. ఆవేశంలో పొరపాట్లు జరిగాయని, వాటిని సరిదిద్దుకుని వివేకంతో మెలగాలన్నారు. చట్టవిరుద్దమైన పనులకు పాల్పడితే సహించేదిలేదన్నారు. రూరల్ ఎస్సై సురేష్ బాబు, సిబ్బంది పాల్గొన్నారు.