కొవ్వూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావుని భవన కార్మిక సంఘ సభ్యులు కలిసారు. ఈ సందర్భంగా సంక్షేమ బోర్డు నుండి దారి మళ్లించిన నిధులను తిరిగి బోర్డులో జమ చేయాలని, అర్హులైన కార్మికులను సంక్షేమ బోర్డులో రిజిస్టర్ చేయాలని ఎమ్మెల్యేకి వినతి పత్రం అందించారు. అనంతరం వారి సమస్యలను పరిష్కరిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.