అభివృద్ధికి మారుపేరు తెలుగుదేశం పార్టీ అని మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు అన్నారు. డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లామండపేట పట్టణం 7వ వార్డు కౌన్సిలర్ సవరపు సతీష్ వైసిపి కి రాజీనామా చేసి తన అనుచరులతో ఆదివారం ఎమ్మెల్యే వేగుళ్ల సమక్షంలో టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా వారందరికీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీ అందరికీ గుర్తింపునిస్తుందన్నారు