బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తే కఠిన చర్యలు తప్పవని జగ్గంపేట ఎస్ఐ రఘునాధరావు హెచ్చరించారు. జగ్గంపేట సీఐ ఆదేశాల మేరకు ఆదివారం రాత్రి గోకవరం రోడ్డులో గల మోడల్ డిగ్రీ కళాశాల, కాపు కళ్యాణమండపం, పోలవరం కెనాల్ కాలువ బహిరంగ ప్రదేశాలను ఎస్ఐ తన సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించడం, చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే చర్యలు తీసుకొంటామన్నారు.