గ్రామాలను అభివృద్ధి చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పేర్కొన్నారు. బుధవారం గండేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. గ్రామీణ అవసరాలు తీర్చాలనే ఉద్దేశంతో ప్రణాళికా బద్దంగా అభివృద్ధి అందించాలని పల్లె పండుగ కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఎవరు ఊహించని విధంగా అభివృద్ధి జరుగుతుందన్నారు.