భారీ వర్షం కారణంగా తిరుపతి జిల్లాలో నేడు (సోమవారం )విద్యా సంస్థలకు సెలవు ప్రకటించినట్లు కలెక్టర్ వెంకటేశ్వరరావు సోమవారం వేకువజామున తెలిపారు. పిడుగులు, భారీ వర్షానికి గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలన్నారు. ఎవరూ సముద్రంలో వేటకు వెళ్లరాదని సూచించారు. అన్ని పాఠశాలలు, కాలేజీలకు ఈ సెలవు వర్తిస్తుందన్నారు.