శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వ రోజైన బుధవారం సాయంత్రం శ్రీవారు బంగారు తేరులో పయనిస్తూ భక్తుల్ని తన కృపాకటాక్షాలతో అనుగ్రహించారు. దాసభక్తుల నృత్యాలతోను, భజనబృందాల కోలాహలం, మంగళ వాయిద్యాల నడుమ తిరు మాడవీధులలో కడురమణీయంగా స్వర్ణరథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీవారి స్వర్ణ రథాన్ని లాగారు.